Medaram Prasadam | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక, సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల ఇండ్ల వద్దకే ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ బుధవారం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకున్నది.
దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తుల ఇండ్ల వద్దకు సంస్థ అందజేయనున్నది. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు బుధవారం నుంచి ఈ నెల 25 వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించింది.