క్లైమేట్ ప్రాజెక్టుకు రూ 5 వేల కోట్ల జర్మనీ రుణం.. డీఈఏ స్రీనింగ్ కమిటీ గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రంలో చేపట్టే పర్యావరణ పరిరక్షణ, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్ర ప్ర భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ క్లైమేట్ రెసిలెంట్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్’ (తెలంగాణ-కృతి) పథకానికి జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ ద్వారా రూ.5 వేల కోట్ల (500 మిలియన్ యూరో లు) విదేశీ ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ (డీఈఏ) స్రీనింగ్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ఢిల్లీలో శుక్రవారం జరిగిన స్రీనింగ్ కమిటీ 167వ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి.. సదరు ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రాధాన్యతలు, అమలు విధానాన్ని వివరించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్ఐడీసీ) చేపట్టే ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.7,143 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,143 కోట్లని డాక్టర్ శ్రీదేవి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

