
జోగులాంబ గద్వాల : పదవీ విరమణ పొందిన ఓ తెలుగు పండితుడు తన ఉదారతను చాటారు. ప్రధానమంత్రి జాతీయ నిధికి రూ.10 లక్షల విరాళం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మానవపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బుచ్చన్న తెలుగు పండిట్‌గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు.
తాను జీవితకాలంలో సంపాదించిన డబ్బులు తన వంతు బాధ్యతగా దేశం కోసం అందించాలని భావించి నగదును కలెక్టర్ వల్లూరు క్రాంతికి చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చన్న మాట్లాడుతూ.. దేశానికి చేయూతనివ్వాలని ఆలోచన తాను చేసే సహాయం పదిమందికి ఉపయోగపడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు బుచ్చన్న లాగా సేవా దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు బీసీ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి దేవన్న కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Road accident |యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిందితుడు రాజు చేతులపై పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
నా చుట్టూ డజన్ల సంఖ్యలో కరోనా సోకినవాళ్లే ఉన్నారు: వ్లాదిమిర్ పుతిన్
Nusrat Jahan: ఎట్టకేలకు తన బిడ్డ తండ్రి ఎవరో చెప్పిన అందాల నటి