Women’s Day | హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు( Govt Woman Employees ) తెలంగాణ సర్కార్( TElangana Govt ) సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanthi Kumari ) ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించడంపై మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. సెర్ప్, మెప్మా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 8న రూ. 750 కోట్ల రుణాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.