Gellu Srinivas Yadav | మూసీ నదిని శుద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. కానీ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నాడని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లోని నిర్వహించిన బీఆర్ఎస్వీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ పరివాహకంలో నివసిస్తున్న ప్రజలందరూ తిరగబడాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను కేసీఆర్ కట్టారని గెల్లు శ్రీనివాస్ తెలిపారు. రేవంత్ రెడ్డి మాత్రం కాంట్రాక్టర్లను పోషించడానికి ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. మూసీ పరివాహకంలో నివసిస్తున్న ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఒక్క ఇంటిని ముట్టుకున్న హైదరాబాద్లో తిరగనివ్వమని తుంగబాలు తెలిపారు. రేవంత్ రెడ్డి, మంత్రులను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇంటిని ముట్టుకోకుండా మూసీ ప్రక్షాళనకు కార్యాచరణ సిద్ధం చేశారని అన్నారు.
.