e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News Huzurabad | 'గెల్లు'కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న హుజూరాబాద్ ప్ర‌జ‌లు

Huzurabad | ‘గెల్లు’కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న హుజూరాబాద్ ప్ర‌జ‌లు

Huzurabad | హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు ఏ గ్రామానికి వెళ్లినా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వీర తిల‌కం దిద్ది, ఉప పోరుకు సాగ‌నంపుతున్నారు. రైత‌న్న‌లు నాగ‌ళ్ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చి ఈట‌ల అక్ర‌మాల కోట‌ల‌ను దున్న‌మ‌ని ఆశీర్వ‌దిస్తున్నారు.

మల్లాపూర్ మండలంలోని గుండె 7 గ్రామంలో ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌తో క‌లిసి ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించారు గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌. ప్ర‌తి ఒక్క‌రూ వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికి ఆశీర్వ‌దించారు.

- Advertisement -

కొత్త‌ప‌ల్లి గ్రామంలో ప్ర‌జ‌లు భారీర్యాలీ తీశారు. డ‌ప్పు ద‌రువులు, కోలాట నృత్యాల‌తో గెల్లు శ్రీ‌నివాస్ బృందానికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ప‌లువురు రైత‌న్న‌లు నాగ‌ళ్ల‌ను బ‌హూక‌రించారు.

కొంద‌రు యాద‌వులు గెల్లు శ్రీ‌నివాస్‌కు గొర్రెపిల్ల‌లు, గొంగ‌డిని బ‌హూక‌రించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక కోలాట క‌ళాకారుల‌తో క‌లిసి నృత్య‌మాడారు గెల్లు శ్రీ‌నివాస్.

పిల్ల‌లు, పెద్ద‌లు ఉత్సాహంగా ప్ర‌చారంలో పాల్గొని టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాల‌ని నిన‌దించారు. ఈ సంద‌ర్భంగా గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. అతి సామాన్యుడిగా భ‌రిలోకి దిగిన తాను, మీ బిడ్డ‌లా అంద‌రి క్షేమం, సంక్షేమం కోసం కృషి చేస్తాన‌ని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement