మీ రాజ్యం మీరేలండి
దేశం మళ్లీ హర్షిస్తున్నది జీవితం తిరిగి ఆశలు గొలుపుతున్నది అధికార మదోన్మత్తులను ధిక్కరించి యువత గొంతెత్తుతున్నది
దేశం మళ్లీ హర్షిస్తున్నది
జీవితం తిరిగి ఆశలు గొలుపుతున్నది
అధికార మదోన్మత్తులను ధిక్కరించి
యువత గొంతెత్తుతున్నది
దేశం కారడవిగా మారి
చీకట్లు కమ్ముతుండిన వేళ
పొంచి దూకుతున్న మృగాలు
పంజాలు విసురుతున్న
విష ఘడియలలో
దేశం అనుక్షణం
భయకంపితమవుతుండిన
కాళరాత్రిలో
భూమి అట్టడుగు నుంచి
విశాలాకాశం నుంచి
అష్ట దిక్కుల నుంచి
పంచభూతాల నుంచి
అకస్మాత్తుగా బద్దలవుతున్న ధిక్కారం
కాంతి పుంజాలతో
కళ్లు మిరుమిట్లు గొలుపుతుండగా
ఆసేతు హిమాచలం
మనస్సులను, మేధస్సులను
కంపింపజేస్తుండగా
దేశమంత మళ్లీ హర్షిస్తున్నది
ఆశీర్వదిస్తున్నది
జీవితం తిరిగి ఆశలు గొలుపుతున్నది
వీధుల నేలుతున్న యువతరమా
ఈ దేశం మీదేనండి
మీ రాజ్యం మీరేలండి
టంకశాల అశోక్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

