హుజూరాబాద్/ హుజూరాబాద్ చౌరస్తా, ఆగస్టు 27: ‘మీ కండ్ల ముందు మెదిలిన బిడ్డ ను.. నిండు మనస్సుతో ఆశీర్వదించండి’ అని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గ్రామస్థులను కోరారు. శుక్రవా రం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో సతీమణి శ్వేతతో కలిసి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తాను మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి ఆయన అడుగుజాడలో నడిచానని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నా అలుపెరుగకుండా ప్రత్యేక రాష్ట్రం వచ్చేవరకూ ఎత్తిన పిడికిలి దించలేదన్నారు. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.