కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్లో విధ్వంసం జరుగుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్లో గత ప దేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇక ముందు కూడా బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు.
శనివారం కరీంనగర్లోని 19,20,51,62 డివిజన్లల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో నగరానికి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆరోపించారు. బీజేపీ ఎంపీగా బండి సంజయ్ ఏడేండ్లుగా నగరంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని డిమాండ్చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.