కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 16 : జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించే జగిత్యాల సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్న సభకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా రవాణా, భోజన సదుపాయాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.