బాలికపై గ్యాంగ్ రేప్..13 మందిపై పోక్సో కేసు
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై ఎనిమిది నెలలుగా లైంగిక దాడి జరుగుతున్నట్టు తెలిసింది.
- కరీంనగర్ జిల్లాలో దారుణం
జమ్మికుంట, ఏప్రిల్ 6: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై ఎనిమిది నెలలుగా లైంగిక దాడి జరుగుతున్నట్టు తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో 13 మందిపై పోక్సో కేసు నమోదైంది. జమ్మికుంటకు చెంది న ఓ మహిళ భర్త చనిపోగా కొడుకు, కూతురితో కలిసి స్థానికంగానే నివాసం ఉంటున్నది. కూతురు 8వ తరగతి చదువుతున్నది. ఆ బాలిక గతంలో వేరే ప్రైవే ట్ పాఠశాలలో చదువగా, ఈ ఏడాది మరో స్కూల్లో చేరింది. ఈ క్రమంలో పాత, ప్రస్తుత పాఠశాలలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు, సిబ్బందితోపాటు బాలిక దూరపు బంధువులు లైంగికదాడి చేస్తున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. కొద్దిరోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లి ఆరా తీసింది. ఈ విషయమై బాలిక, ఆమె తల్లి జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. దీంతో 13 మందిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
లైంగికదాడి కేసులో 20 ఏండ్ల జైలు
వరంగల్ లీగల్, ఏప్రిల్ 6 : బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకొని లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ హనుమకొండ పోక్సో చట్టం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సో మవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..కాజీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రఫీక్ అలియాస్ ఆకాశ్ ప్రేమ పేరుతో లొంగదీసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కనిపించడం లేదని తండ్రి 25 అక్టోబర్ 2020న ఫిర్యాదు చేయగా మ డికొండ పోలీసులు విచారిస్తున్న క్రమం లో నిందితుడు ఆమెను 27 అక్టోబర్ 2020న గ్రామంలో వదిలి పారిపోయా డు. అప్పటి కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ నిందితుడిపై లైంగికదాడి, పోక్సో చట్టం కింద కేసు న మోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో 20 ఏండ్ల కఠిన కా రాగార శిక్షతోపాటు రూ.14 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చె ప్పారు. బాధితురాలికి రూ.2 లక్షల హా రం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

