సంగారెడ్డి డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): బాలికపై లైంగికదాడికి పాల్పడిన నలుగురిపై సంగారెడ్డి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రామునాయుడు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన 13 ఏండ్ల బాలిక 4 రోజుల క్రితం కర్నూలుకు వెళ్లింది. తిరిగి సంగారెడ్డికి వస్తున్న క్రమంలో సికింద్రాబాద్ బస్టాండ్లో వేచి ఉన్నది. బాలికను గమనించిన మంచిర్యాల జిల్లాకు చెందిన నలుగురు యువకులు మాయమాటలు చెప్పి ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫోన్ సిగ్నల్ ఆధారంగా అక్కడికి వెళ్లిన పోలీసులు, యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు.