హైదరాబాద్, సెప్టెంబరు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా సాగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ పోర్టల్లో 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని చెప్పారు. నిరుడు 1.15 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని తెలిపారు.
హైదరాబాద్లో నిమజ్జనాల కోసం 25 వేలకుపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శనివారం ఉదయం 10.30లోపు నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు చె ప్పారు. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని డీజీపీ అభినందించారు. ఈగల్ ఫోర్స్ పనితీరుపై డైరెక్టర్ సందీప్ శాం డిల్య, అధికారులు, సిబ్బందితో సమీక్షించారు.