ఆదిలాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే చెప్పు దెబ్బలు తప్పవని టీపీసీసీ మాజీ ప్రధాన కా ర్యదర్శి గండ్రత్ సుజాత హెచ్చరించారు. మం గళవారం ఆమె ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కంది శ్రీనివాస్‌రెడ్డి నోరు ఉన్నదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రజాసేవ ముసుగులో ప్రజలను దోచుకునేందుకు వచ్చాడని విమర్శించారు. గతంలో బీజేపీలో ఉన్న కంది.. కమలం పార్టీ అగ్రనేత సంతోష్ తన జేబులో ఉన్నారని బీజేపీ టికెట్లు తాను ఇప్పిస్తానని చెప్పిన ఆయ న 3 నెలల్లో కాంగ్రెస్‌లో ఎందుకు చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము డబ్బులు తీసుకున్నామని చెబుతున్న ఆయన నిరూపించాలని, ఆదిలాబాద్‌లో ఎక్కడకు, ఎప్పుడు రావాలో నిర్ణయించాలని సవాల్ విసిరారు. అమెరికాలో ఉద్యోగులను మోసం చేశాడని, శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు చేయాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, సీనియర్ నాయకుడు సంజీవరెడ్డి ఉన్నారు. ఈనెల 12న చెప్రాలలో శ్రీనివాస్‌రెడ్డి తనను అనుచిత పదజాలంతో దూషించాడని సుజాత ఫిర్యాదు మేరకు బేల పోలీసులు కేసు నమోదు చేశారు.