కృష్ణకాలనీ, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కాంగ్రెస్ గుండెలదిరేలా తరలిరావాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 11, 12, 13, 14 వార్డుల్లోని కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
అనంతరం కాసింపల్లిలో 200 బైకులతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో గండ్ర పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో తాను రూ.30 కోట్ల నిధులకు ఒకటే శిలాఫలకం వేస్తే, ఆ నిధులకే ప్రస్తుత ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు ఒక్కొక్క శిలాఫలకాన్ని వేశారని విమర్శించారు. 27న ఎలతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభకు ప్రతి వార్డు నుంచి 250 మందిని తరలించాలని కోరారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా చేసే ఏకైక నేత కేసీఆర్ సంకల్పానికి చేయూతనివ్వాలని బుధవారం ఓ ప్రకటనలో కోరారు.
కొండమల్లేపల్లి, ఏప్రిల్ 16 : కాంగ్రెస్‌ది అసమర్థ పాలన అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బుధవారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పాలన చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతున్నదని తెలిపారు. రేవంత్‌రెడ్డికి ఢిల్లీ చుట్టూ తిరగడమే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై సోయిలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం పరితపించేది కేసీఆర్ ఒక్కరేనని తెలిపారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 27న ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 16: కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన తులం బంగారం హామీ ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం హనుమకొండలోని 4వ డివిజన్ పరిధి యాదవ్‌నగర్‌లో కార్పొరేటర్ బొంగు అశోక్‌యాదవ్ అధ్యక్షతన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో ఏ ఒకటీ సంపూర్ణంగా అమలు చేయలేదని విమర్శించారు. ఈ నెల 27 జరిగే సభను విజయవంతం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెప్పా రు. అనంతరం బీఆర్ఎస్ కార్యాల యాన్ని ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు.