దుండిగల్, నవంబర్ 5 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్‌లోని లేక్ వ్యూ కాలనీలో మంగళవారం గుర్తు తెలియని దుండగులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వసం చేశారు. జాతిపిత విగ్రహం తలను వేరు చేసి దుశ్చర్యకు పాల్పడ్డారు. గాంధీజీ విగ్ర హం ధ్వంసంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మార్నింగ్ వాకర్స్ మద్ది నారాయణరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, మహేశ్ గుప్తా, సామ్రాజ్యలక్ష్మి, గోపాలరాజు కోరారు. విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.