హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) గుండెపోటుతో మరణించినట్లు గాంధీ దవాఖాన డాక్టర్లు వెళ్లడించారు. సోమవారం ఉదయం 7.20 గంటలకు గాంధీ హాస్పిటల్కు తీసుకువచ్చారని, ఆయన అప్పటికే చనిపోయారని గాంధీ హాస్పిటల్ హెచ్వోడీ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. ‘మా దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన చనిపోయి 5 లేదా 6 గంటలు అయినట్లు ఉంది. 15 ఏండ్లుగా రక్తపోటు (BP) ఉంది. దీనికి సంబంధించిన మందులను ఆయన నెల రోజులుగా వాడటం లేదు. గత మూడు రోజలుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ వైద్యులను సంప్రదించలేదు. రాత్రి భోజనం చేసిన తర్వాత మామూలుగానే పడుకున్నారు. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదు. ఉదయమే ఆయనను కుటుంబ సభ్యులు గమనించారు. ఆయన చనిపోయి ఐదు గంటలు అయి ఉండవచ్చు’ అని తెలిపారు.