కథలాపూర్, డిసెంబర్ 12 : సర్పంచ్ స్థా నానికి పోటీ చేసిన త మ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక మహిళ మృ తిచెందింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. గంభీర్‌పూర్‌కు చెందిన పోతు శేఖర్ సర్పంచ్‌గా బరిలో ఉండి ఓటమిపాలయ్యా డు.
గురువారం రాత్రి కౌంటింగ్ పూర్తయ్యాక శేఖర్ ఇంటికి చేరుకోగా.. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. శేఖర్ సర్పంచ్‌గా గెలువాలని అక్క మమత కొన్ని రోజులుగా ప్రచా రం చేసింది. తమ్ముడు ఓటమిపాలయ్యాడని తెలియగానే మమతకు గుండెపోటు రావడంతో చికిత్స కోసం కోరుట్లకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందింది. మమతకు గతంలో గుండెపోటు రాగా, స్టెంట్ వేసినట్టు స్థానికులు తెలిపారు.