Gadwal Vijayalakshmi | వలస కాంగ్రెస్ నేతకే మరో పదవి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి!
Gadwal Vijayalakshmi | రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్‌పర్సన్‌తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీచేశారు.
Gadwal Vijayalakshmi | హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్‌పర్సన్‌తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వు లు జారీచేశారు.
కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళా యాదవరెడ్డి, సదాలక్ష్మి, ఎన్ రాధాబాయి, ఉజ్మా ఆషై షకీరాను సభ్యులుగా నియమించారు. ఐదేండ్లపాటు వారు ఈ పదవు ల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాగా కాంగ్రెస్ అసలు నేతల కు రేవంత్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించి, వలస కాంగ్రెస్ నేత విజయలక్ష్మికే మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ మూడు నెలల ముందే పసిగట్టి చెప్పింది. ‘వలస కాంగ్రెస్‌కే మరో పద వి’ శీర్షికతో ఈ ఏడాది ఫిబ్రవరి 4న కథనం ప్రచురించింది.
పార్టీ కోసం కష్టపడిన మాజీ చైర్పర్సన్ నేరెళ్ల శార ద కేవలం 14 నెలలు మాత్రమే పని చేశారని, కానీ సీఎం మాత్రం.. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేశవరావు కుమార్తె విజయలక్ష్మి కోసం సీటు రిజర్వ్ చేసిపెట్టారని కథనంలో వివరించింది. ఈ కథనంపై అప్పట్లో కాంగ్రెస్ పార్టీవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాగా చివరికి ఆమెకే అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

