గద్వాల, జూన్ 9 : రాజోళి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పెద్ద ధన్వాడ వాసులు కలెక్టర్ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులతోపాటు అఖిలపక్షం నాయకులు సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. రైతులపై పెట్టిన తప్పడు కేసులు వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో సంబంధంలేని పలువురిపై మాజీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రశాంత వాతావరణంలో ఉన్న పల్లెలో ఫ్యాక్టరీ పేరుతో చిచ్చు రాజేసి యుద్ధ వాతావరణాన్ని కల్పించారని మండిపడ్డారు. ప్రజలకు కడుపు మండి కంపెనీ ఆస్తులపై దాడి చేశారే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టడంలో ఎస్సై ప్రాధాన పాత్ర పోషించారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.