ధరూరు, ఆగస్టు 18 : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నోట నాటి కేసీఆర్ ప్రభుత్వం మాట వినిపించింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సమగ్ర అభివృద్ధిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
గత ప్రభుత్వంలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకున్నట్టు గుర్తుచేశారు. డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలు, రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాలు గ్రామాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని కొనియాడారు.