యాదాద్రి భువనగిరి : ఎప్పుడో తరతరాల నుంచి వచ్చిన యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించి ప్రజలకు అందించారు. అలాంటి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. గురువారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే యాదగిరిగుట్టకొచ్చి నరసన్న నీకు వందనాలు.. తెలంగాణ వస్తే మీకు పూజలు చేస్తామని ఆనాడే మొక్కుకున్నామన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం యాదాద్రిని సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.