అడ్డగూడూరు, సెప్టెంబరు 10 : రేవంత్‌రెడ్డి శిఖండి రాజకీయాలు మానుకోవాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సూచించారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసించేందుకు నల్ల టీషర్టులు వేసుకొని వస్తే ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
రాహూల్ గాంధీ నల్ల టీషర్టులతో పార్లమెంటుకు పోవొచ్చు కాని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకూడదా.. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.