దేవరుప్పుల, సెప్టెంబర్ 10 : ‘ఉత్తమన్నా రైతులు గోస పడుతుండ్రు.. నీళ్లు వదలరాదే..’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రాధేయపడ్డారు. ఎర్రబెల్లి చిన్నాన్న మురళీధర్‌రావు మనుమడి వివాహ వేడుకకు గురువారం హాజరైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అక్కడే ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కలిశారు.
ఈ సందర్భంగా దేవాదుల, ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి ఎండుతున్న పంట పొలాలను కాపాడాలని కోరారు.