బంజారాహిల్స్,సెప్టెంబర్ 10 : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్‌పై నమోదైన హత్యాయత్నం కేసు విచారణలో భాగంగా గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. మేడిపల్లి ప్రాంతానికి చెందిన వ్యాపారి హరికృష్ణపై దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్‌తోపాటు మరికొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటికే సుమంత్ అనుచరులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు అరస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కాగా, ఏ-1గా ఉన్న సుమంత్ హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ లభించింది. అయితే కోర్టు కేసు విచారణకు సహకరించాలని ఆదేశించడంతో గురువారం తన న్యాయవాదులతోపా టు జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చిన సుమంత్.. విచారణ ఎదుర్కొన్నారు. అనంతరం పిలిచినప్పుడు విచారణకు రావాలని సుమంత్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.