ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 14 : విద్యార్థి, నిరుద్యోగ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న సెక్రటేరియట్ ముట్టడికి తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్(టీఎస్పీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
డీఎస్సీ వాయిదాతోపాటు గ్రూప్-2, 3 పోస్టులను పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని తలపెట్టిన సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.