హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : న్యాయమూర్తి జస్టిస్ పీ శ్రీసుధకు సోమవారం హైకోర్టు వీడోలు పలికింది. బదిలీపై కర్ణాటక హైకోర్టుకు వెళ్తున్న జస్టిస్ శ్రీసుధకు.. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్ అధ్యక్షతన జరిగిన ఫుల్‌కోర్టు సమావేశం ఘనంగా వీడోలు చెప్పింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జస్టిస్ శ్రీసుధ 5,055 కేసులు పరిషరించారని, కుటుంబ సంబంధిత వివాదాల పరిషారంలో కీలకపాత్ర పోషించారని జస్టిస్ సుజోయ్‌పాల్ చెప్పా రు.
ఆమె వెలువరించిన ముఖ్య తీర్పులను అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వివరించారు. జస్టిస్ శ్రీసుధ మాట్లాడుతూ.. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు సహా పలు ప్రధాన కేసుల తీర్పుల విచారణ, తీర్పులో భాగస్వామి కావడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ సొ లిసిటర్ జనరల్ నర్సింహశర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు, బార్‌కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి తదితరులున్నారు.