హైదరాబాద్, అక్టోబర్21 (నమస్తే తెలంగాణ): సీనియార్టీ అక్కర్లేదు. అనుభవ నైపుణ్యాలతో పనిలేదు. నచ్చితే చాలు. రాజకీయ పలుకుడి ఉంటే సరి. ఫుల్ అడిషనల్ చార్జీ వచ్చేస్తున్నది. ఇదీ ఇరిగేషన్‌శాఖలో ఉన్నతాధికారుల తీరు. అంతా సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కనుసన్నల్లోనే కొనసాగుతున్నదని ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఎఫ్ఏసీలుగా (ఫుల్ అడిషనల్ చార్జీ) బాధ్యతలను అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా డిపార్ట్మెంట్లో ముగ్గురు ఇంజినీర్లకు ఈఈలుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. 2004 బ్యాచ్‌కు చెందిన సీనియర్లను పకనపెట్టి 2005, 2007 బ్యాచ్‌లకు చెందిన జూనియర్లను ఈఈలుగా, లేదంటే డిప్యూటీ ఎస్ఈలుగా ఎఫ్ఏసీలుగా నియమించడంపైనే ఇంజినీర్లు నిప్పులు చెరుగుతున్నారు.
తాజాగా మరొక జూనియర్ డీఈఈకి ఈఈగా అదనపు బాధ్యతలను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ ఇరిగేషన్ సర్కిల్లో భైంసాలో డీఈఈ అనిల్‌కు ఆ సరిల్లోని సీనియర్లను పకనపెట్టి డివిజన్ డీఈఈగా అదనపు బాధ్యతలను అప్పగించడంపై రచ్చ కొనసాగుతున్నది. సదరు డీఈఈ బంధువు సచివాలయంలో సెక్రటరీస్థాయి అధికారి అని, రాజకీయ పలుకుబడితోనే ఇలా చేశారని ఇంజినీర్లు చర్చించుకుంటున్నారు. ఖమ్మంలోనూ 2005 బ్యాచ్‌కు చెందిన ఒకరికి ఇదే తరహాలో డిప్యూటీ ఎస్ఈగా ఎఫ్ఏసీగా నియమించారని గుర్తుచేస్తున్నారు.