హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(ఎఫ్ఆర్ఎస్)ను శనివారం నుంచి అమలుచేయనున్నారు. హాజరు నమోదు కోసం టీజీ డీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
లెక్చరర్లు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా వినియోగించుకోవాలో సూచించే మాడ్యూల్‌ను ప్రిన్సిపాళ్లకు పంపించారు. విద్యార్థులతోపాటు లెక్చరర్లు, సిబ్బందికి కూడా ఎఫ్ఆర్ఎస్ హాజరు తప్పనిసరి చేశారు. విద్యార్థుల గైర్హాజరు సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేస్తారు.