Urea | కథలాపూర్, ఆగస్టు 19 : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన ముక్కెర మధు అనే యువ రైతు పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాత్రి నిర్వహించారు. పుట్టినరోజు కానుకగా మధుకు తోటి మిత్రులు యూరియా బస్తాను బహుమతిగా అందించారు. యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందుకోసమే యూరియా బస్తాను పుట్టినరోజు కానుకగా అందించినట్లు యువకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని యువకులు మంచాల మహేష్, మామిడిపల్లి శివ, మంచాల శేఖర్, ఆసరి సంజీవ్, వంగ మనోజ్, ఆవుల మహిపాల్ కోరారు.