బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయడం చెల్లదు
చట్టపరమైన సాక్ష్యాధారాలు లేకుండా బ్యాంక్ ఖాతా స్తంభింపజేయడం చెల్లదని హైకోర్టు స్పష్టంచేసింది.
- చట్టప్రకారం అది హక్కుల ఉల్లంఘనే: హైకోర్టు
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): చట్టపరమైన సాక్ష్యాధారాలు లేకుండా బ్యాంక్ ఖాతా స్తంభింపజేయడం చెల్లదని హైకోర్టు స్పష్టంచేసింది. నేరాభియోగానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఏకపక్షంగా ఖాతాను స్తంభింపజేయడం వ్యాపార, వాణిజ్య ప్రాథమిక హకులను ఉల్లంఘించడమే కాకుండా, జీవనోపాధిని కూడా దెబ్బతీయడం అవుతుందని తేల్చి చెప్పింది.
యాంత్రికంగా ఖాతాను స్తంభింపజేయడం జీవించే హకుతోపాటు అధికరణం 19(1)(జే) ప్రకారం వ్యాపార, వాణిజ్యం చేసుకునే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని తీర్పు చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లా సైబర్ క్రైమ్ విభాగం ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ బ్యాంకులోని తమ ఖాతాను స్తంభింపజేయడం అన్యాయమంటూ ఖమ్మంకు చెందిన ది బాటిల్ రెస్టారెంట్ అండ్ బార్ యజమాని కందిబండ శ్రీధర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తి చేసిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ పై తీర్పు వెలువరించారు. తక్షణమే బ్యాంక్ ఖాతాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

