హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): వాయు కాలుష్యం నుంచి నల్లగొండ పట్టణం విముక్తి పొందింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల నల్లగొండలో కాలుష్యం గణనీయంగా తగ్గినట్టు రా్రష్ట్ర పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ ప్రకటించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు పటిష్ఠ ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
కాలుష్య తీవ్రతను అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్ల నుంచి ఐఐటీ కాన్పూర్ ఆధ్వర్యంలో శాస్త్రీయ అధ్యయనం చేయిస్తున్నది. దీనిపై సోమవారం సమీక్షించిన రజత్‌కుమార్.. అధికారులకు పలు సూచనలు చేశారు. పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 10, పీఎం 2.5లను)ను తగ్గించేందుకు వెంటనే చర్యలు చేపట్టడంతోపాటు ఎలక్ట్రానిక్, నిర్మాణ వ్యర్థాల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.
వాయు కాలుష్య నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులను విడుదల చేస్తున్నదని, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిధులను వెచ్చించి కాలుష్యాన్ని పూర్తిగా అదుపుచేస్తామని చెప్పారు. సనత్‌నగర్‌లోని టీఎస్‌పీసీబీ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో టీఎస్‌పీసీబీ సభ్యకార్యదర్శి నీతూకుమారి ప్రసాద్, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ ముఖేశ్‌శర్మ, నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ బీ సేన్‌గుప్తా, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పూర్వ సభ్యకార్యదర్శి డా టీవీబీఎస్ రామకృష్ణ, నీరి శాస్త్రవేత్త డాక్టర్ ఆసిఫ్ ఖురేషి, టీఎస్‌పీసీబీ చీఫ్ ఇంజినీర్ రఘు, పర్యావరణ శాస్త్రవేత్త దాసరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పురోగతి ఇలా..