మద్దూరు(ధూళిమిట్ట), జనవరి 8: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లికి చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు జంగిటి లచ్చవ్వ (95) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం మరణించారు. 1948లో బైరాన్‌పల్లి కేంద్రంగా రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో జంగిటి లచ్చవ్వ చేసిన వీరోచిత పోరాటాన్ని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు.
లచ్చవ్వకు ఇద్దరు కుమారులు, ఇద్దర కుమార్తెలు ఉన్నారు. ఆమె మృతిపట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థులు సంతాపం తెలిపారు.