హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : పోలీసుశాఖలో ఉద్యోగాలకు సిద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులు రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందిస్తున్నదని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాషా తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్ఐ పోస్టులకు 50మంది, కానిస్టేబుల్ పోస్టులకు 100మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసి శిక్షణ ఇస్తారని వెల్లడించారు. వివరాలకు 85208 60785, 040-23236112, 90590 50062ప సంప్రదించాలని తెలిపారు.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : పోలీసుశాఖలో ఉద్యోగాలకు సిద్ధమయ్యే మైనార్టీ అభ్యర్థులు రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందిస్తున్నదని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాషా తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎస్ఐ పోస్టులకు 50మంది, కానిస్టేబుల్ పోస్టులకు 100మందిని మెరిట్ ప్రాతిపదికన ఎం పిక చేసి శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు జతచేసి ఈనెల 15లోగా తమ జిల్లాల్లోని మైనార్టీ సంక్షేమశాఖ అధికా రి కార్యాలయాల్లో లేదా హైదరాబాద్‌లోని మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. వివరాలకు 85208 6078 5, 040-23236112, 90590 500 62 నంబర్లను సంప్రదించాలన్నారు.