హైదరాబాద్, అక్టోబర్ 4, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని హైకోర్టు ఆవరణలో శుక్రవారం ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థ, ఉస్మానియా దవాఖాన, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించారు. న్యాయవాదులు, హైకో ర్టు సిబ్బందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్‌పాల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, పలువురు న్యాయమూర్తులు, న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి పంచాక్షరి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ రవీందర్‌రెడ్డి, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ కుమార్, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ సీఈ వో మయూర్ పట్నాల పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయ నిర్మాణానికి సంబంధించి హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవన నిర్మాణంపై తాజాగా దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌తో కలిపి ఈ నెల 21న విచారణ జరుపుతామని, అప్పటివరకు అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.
ఖమ్మం మున్నేరు వరద బాధితులను ఆదుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు రూ.16,500 సాయాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.