హైదరాబాద్, మార్చి30 (నమస్తే తెలంగాణ): గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు మూడునెలలపాటు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు వోల్స్కై టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన పథకంలో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. టెలికంరంగానికి సంబంధించి బ్రాండ్ బాండ్ టెక్నిషియన్, గ్రామీణ్ ఉద్యాని ప్రోగ్రామ్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 18-28ఏండ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతీ యువకులు శిక్షణకు అర్హులని వివరించారు. శిక్షణకాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 97047 82992, 98489 87588 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.