హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): పేద విద్యార్థులకు అమెరికాలో ఉచిత విద్య అందించనున్నట్టు భారత్, యూఎస్ వర్క్‌ఫోర్స్ భాగస్వామి, ముర్లీ సెంటర్డ్ ప్రాజెక్ట్ హెడ్ ప్రొఫెసర్ అనంత సుధాకర్ బాబ్బిలి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ తొలుత 15 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని పేర్కొన్నారు. ఇందుకు కాగ్నిజెంట్ ఫిలాంత్రోఫిస్ సంస్థ, 1200 అమెరికన్ కమ్యూనిటీ కాలేజీల ప్రాతినిథ్యం వహించే అసోసియేషన్ ఆఫ్ కమ్యూనిటీ కాలేజీ ట్రస్టీస్, భారత రాయబార కార్యాలయం మద్దతునిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీతోపాటు, లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీ, బాయ్స్ టౌన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు తెలిపారు.