Free Driving Classes | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళలకు జిల్లాలవారీగా ఆటో, కారు డ్రైవింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఉచితంగా శిక్షణ ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం మధురానగర్లోని మహిళా, స్త్రీ సంక్షేమశాఖ కార్యాలయంలో మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. 18 నుంచి 45 ఏండ్లలోపు మహిళల ఉపాధికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రాల్లోని మహిళా ప్రాంగణాలను నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మార్చాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒక్కొక్క మహిళా ప్రాంగణాన్ని ఒక్కో రంగంలో శిక్షణ కోసం ఉపయోగించాలని సూచించారు.