జగిత్యాల : గ్రూప్ 1,2,3,4 ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు జగిత్యాల జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయిబాబా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నిరుద్యోగ అభ్యర్థుల కోసం మోతే రోడ్డు లోని ఎమ్మెల్యే నివాస భవనంలో ఉచిత మధ్యాహ్నం భోజన సదుపాయం, ఉచిత స్టడీ మెటీరియల్ అందజేయనున్నట్లు సాయిబాబా వివరించారు. అభ్యర్థులు జగిత్యాల జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9949243467, 9603681993 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.