నిర్మల్ : నిర్మల్ జిల్లా(Nirmal district) భైంసా ఎస్సీ హాస్టల్ బాలుర వసతి గృహం(SC hostel) నుంచి మంగళవారం ఉదయం నలుగురు విద్యార్థులు అదృశ్యమవడం(Students missing) స్థానికంగా కలకలం రేపింది. చరణ్, రాకేష్, కేశవ్, ఈశ్వర్ అనే నలుగురు విద్యార్థులు మంగళవారం అదృశ్యమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వార్డెన్ నగేష్ విద్యార్థుల తల్లితండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో హాస్టల్స్ నుంచి విద్యా్ర్థులు పారి పోవడమో లేదా ఆత్మహత్యలు చేసుకోవడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనక గురవుతున్నారు. విద్యార్థులకు సరైన మార్గదర్శనం, వసతులు లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతాయని, ప్రభుత్వం అటువైపుగా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.