హైదరాబాద్ : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్ – లింగంపల్లి, లింగంపల్లి – కాకినాడ టౌన్ మార్గాల్లో ప్రత్యేక రైళ్ల నడుపనున్నట్లు తెలిపింది. ఈ నెల 24, 26, 28, 31 తేదీల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ప్రత్యేక రైలు (07295) రాత్రి 8.10 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి స్టేషన్కు చేరుకుంటుందని పేర్కొంది.
సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నల్లగొండ, సిక్రిందాబాద్ మీదుగా లింగంపల్లికి చేరుకుంటుందని పేర్కొంది. అలాగే ఈ నెల 25, 27, 29, ఫిబ్రవరి 1న నాలుగు రైళ్లు లింగంపల్లి – కాకినాడ టౌన్ మార్గంలో నడుస్తాయని, సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Eight Special Trains Between Kakinada Town – Lingampalli#specialtrains@drmhyb @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/ttUM1UADeV
— South Central Railway (@SCRailwayIndia) January 17, 2022