లగ్జరీ జర్నీ.. లైఫ్ రిస్క్!
సౌకర్యవంతమైన ప్రయా ణం అంటూ ప్రయాణికుల ప్రాణాల భద్రతను మ రిచి కొన్ని ట్రావెల్స్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.
- ట్రావెల్ బస్సుల్లో గాజు చాంబర్లు
- పరిమితికి మించి సీట్ల బిగింపు
- నాలుగు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు సీజ్
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ)/ హైదరాబాద్ సిటీబ్యూరో: సౌకర్యవంతమైన ప్రయా ణం అంటూ ప్రయాణికుల ప్రాణాల భద్రతను మ రిచి కొన్ని ట్రావెల్స్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదాలకు తావిచ్చేలా గాజు చాంబర్లు ఏర్పాటు చేస్తున్నాయి. పరిమితికి మించి సీట్లు బిగిస్తున్నాయి. ఆ లగ్జరీ సీట్లను చూపించి ప్రయాణికుల వద్ద టికెట్ ధర కంటే నాలుగు రెట్ల డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నాయి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం బస్సుల్లో గాజు చాంబర్లు ఏర్పాటు చేయకూడదు. పలు ఫిర్యాదులు రావడంతో రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 4 ప్రైవేట్ స్లీపర్ బస్సులను సీజ్ చేసినట్టు జేటీసీ చంద్రశేఖర్గౌడ్ శనివారం తెలిపారు. ఇందు లో మూడు అరుణాచల్ ప్రదేశ్, ఒకటి రాజస్థాన్లో నమోదైన బస్సులు ఉన్నవని పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి రాజస్థాన్ నుంచి వస్తున్న ట్రావెల్ బస్సును ఖైరతాబాద్లో ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గాజు చాంబర్లు ఏ ర్పాటు చేయడంతో ఆ బస్సును సీజ్ చేసి ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి తరలించారు. ఆ బస్సు ఫిట్నెస్ రద్దు చేయాలని రాజస్థాన్ ఆర్టీఏకు సూచించినట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

