Telangana | వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రెండు ఆటోలను వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై బోల్తా పడింది. ఈ క్రమంలో లారీలోని ఐరన్ రాడ్లు ఆటోలపై పడ్డాయి. దీంతో ఆటోలు నుజ్జునుజ్జయ్యాయి. ఇనుప రాడ్లు మీద పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ కాలు కూడా విరిగిపోయింది. ఇనుప రాడ్ల కింద మరికొందరు వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో మరణించిన వారిని మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా లలితానగర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ
చిన్నారితో సహా ఏడుగురు మృతి
వరంగల్ – మామునూరు భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఆటోను ఢీ కొట్టిన రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ
ఆటోపై పడ్డ రైలు పట్టాలు.. ఏడుగురు మృతి, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
రైలు పట్టాల కింద ఇరుక్కున్న మరికొందరు… pic.twitter.com/qEtx6GZ6w5
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025