మహబూబ్‌నగర్ కలెక్టరేట్, డిసెంబర్ 22: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని మీడియా సాక్షిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండగట్టడంతో ప్రభుత్వంలో అలజడి ప్రారంభమైంది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో నలుగురు మంత్రులు పాల్గొన్నారు. వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, వివేక్, పొన్నం, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని బాలికల బీసీ సంక్షేమ వసతి గృహ ప్రాంగణంలో డిజిటల్ లెర్నింగ్ సెంటర్, అప్పన్నపల్లిలో గొర్రెలు-మేకలకు నట్టల నివారణ మందు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా పిల్లలమర్రి రోడ్‌లోని ఎండీసీఏ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్‌ను తిలకించారు.