జనగామ చౌరస్తా, డిసెంబర్ 30 : జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా ఆదివారం రెండు బైక్‌లపై వెళ్తున్న నలుగురికి గాలి పటాలకు సంబంధించిన చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వినోద్, కోమల దంపతులు కుమారుడు వీక్షిత్తో కలిసి బైక్‌పై వడ్లకొండకు వెళ్లారు. అక్కడ శుభకార్యం ముగిసిన అనంతరం జనగామకు వస్తుండగా చైనా మాంజా తగలడంతో ముందు కూర్చున్న వీక్షిత్కు తీవ్ర గాయాలవగా, తల్లిదండ్రులకు స్వల్పగాయాలయ్యాయి. మరో బైక్‌పై వెళ్తున్న బచ్చన్నపేటకు చెందిన సనత్కుమార్కు మెడ, గొంతు భాగంలో మాంజా తెగి రక్తస్రావం జరిగింది. వీక్షిత్కు చంపక్‌హిల్స్‌లోని ఎంసీహెచ్‌లో, సనత్ కుమార్‌కు స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో చేర్చారు.
ఆన్లైన్ మోసానికి యువకుడు బలి
వీణవంక, డిసెంబర్ 30 : ఆన్లైన్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి మోసపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ తోట తిరుపతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బేతిగల్‌కు చెందిన ఉమ-సృజన్ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రిషివర్ధన్(18) ఆన్లైన్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టాడు. కంపెనీ వారు ఇంకా పెట్టుబడులు పెట్టాలని కోరగా డబ్బులు పెట్టలేక, ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే కోపగిస్తారని భయపడ్డాడు. సోమవారం సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సృజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.