Mancherial | అకాల వర్షం రైతు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వరి ధాన్యాన్ని కాపాడుకోవాలని కల్లాల వద్దకు వెళ్లిన రైతులపై మృత్యువు విరుచుకుపడింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా రెండే వేర్వేరు ఘటనల్లో నలుగురు రైతులు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గంపలపల్లి ధాన్యంపై పరదాలు కప్పేందుకు వెళ్లి వర్ష ఎక్కువ కావడంతో పక్కన షెడ్ లోకి వెళ్లిన తనుగుల నాగరాజు, అభిరామ్ తండ్రీ కొడుకులపై గోడ కూలి మృతి చెందారు.
కొత్తూరు గ్రామంలో వరి ధాన్యం పై పరదాలు కప్పేందుకు వెళ్లిన రైతులు ఆరుగురు మీద గోడ కూలి పడింది. ఈ ఘటనలో గుండారపు వెంకటేష్ (కొత్తూరు) రైతు మృతి చెందారు. ముత్యం పేట గ్రామానికి చెందిన నెల్క లచ్చన్న అనే వ్యక్తి లక్షెట్టిపేటలో తన కొడుకును బస్ ఎక్కించి తిరిగి ఇంటికి వెళ్తూ వర్షం పడుతుంది అని కొత్తూరు లో రైతులు ఆగిన దగ్గర ఆగారు. ఈ క్రమంలో గోడ కులడంతో ఆయన సైతం మృతి చెందారు. ఘటనలో గాయ పడిన మరో నలుగురిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు.