Telangana | తెలంగాణ రాష్ట్రంలో రహదారులు నెత్తురోడాయి. బుధవారం ఉదయం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బైక్, కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. స్పాట్లోనే ఒకరు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు దుర్మరణం చెందారు.
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో బుధవారం తెల్లవారుజామున కంటైనర్ను రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదంలో బస్సు క్యాబిన్లోనే డ్రైవర్ ఇరుక్కుపోయాడు. డ్రైవర్ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి బస్సు విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.