TG Weather | రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాంతో వాగలు వంకలు ఉప్పొంగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభిస్తున్నది. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు చేసింది. తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
గల్ఫ్ ఆఫ్ కాంబే, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ గుజరాత్ విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా సగుట సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. ఇక తెలంగాణలో సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని చెప్పింది.
మంగళశారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. అలాగే, బుధ, గురువారాల్లోనూ హైదరాబాద్, రంగారెడ్డి సహా ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ వివరించింది.