హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. 39 మందితో కూడిన ఈ జాబితాలో 4 తెలంగాణ స్థానాలు ఉన్నాయి. నల్లగొండ నుంచి రఘువీర్‌రెడ్డి (సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు), మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి, మహబూబాబాద్ నుం చి కేంద్ర మాజీ మంత్రి బల్రామ్ నా యక్, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్ పోటీ చేయనున్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 13 స్థానాలను కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టింది. వీటిలో ఖమ్మం, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, మెదక్ వంటి కీలకస్థానాలున్నాయి. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కుమారుడు యుగంధర్ టికెట్ ఆశిస్తున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ టికెట్ కోసం పోటీపడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆలీ మస్కతి, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ నుంచి టీ జీవన్‌రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ (ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు), వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం. అయితే పొత్తులో భాగంగా వరంగల్ స్థానం తమకు కేటాయించాలని సీపీఐ గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది.
నిమిషాల్లో పేర్లు తారుమారు!
తొలుత ఏఐసీసీ లెటర్‌హెడ్‌తో సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అయిన జా బితాలో చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి పోటీ చేయనున్నట్టు ఉన్నది. కానీ అధికారిక ప్రకటనలో మాత్రం ఆమె పేరు లేదు. అలాగే మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్‌రెడ్డి పేరును హో ల్డ్‌లో పెట్టినట్టు ఉండగా.. అధికారిక ప్ర కటనలో మాత్రం ఆయన పోటీ చేయనున్నట్టు వెల్లడించారు.