జహీరాబాద్ : జాతీయస్థాయిలో జహీరాబాద్ డీడీఎస్ ( Zaheerabad DDS ) కేవీకే కేంద్రానికి నాలుగు అవార్డులు (National level Awards) లభించాయి. అటారి జోన్–10 పరిధిలోని 72 కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక జోనల్ వర్క్షాప్ఈనెల 2 నుంచి 4 వ తేదీ వరకు తమిళనాడు( Tamilnadu ) రాష్ట్రం వెల్లూరులో నిర్వహించారు. ప్రతి ఏడాది జరిగే ఈ సమావేశంలో కేవీకేల పనితీరు సమీక్ష నిర్వహించి అవార్డులు ప్రశంస పత్రాలను అందజేస్తారు.
ఈ సందర్భంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం నాలుగు విభాగాల్లో అవార్డులు సాధించింది. స్థానిక డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సి. వరప్రసాద్ ( Dr. C. Varaprasad ) వెల్లూరులో ఈ అవార్డులు, ప్రశంస పత్రాలను అందుకున్నారు.
మట్టి ఆరోగ్య కార్డులు, మట్టిశాస్త్రంపై ఆధారపడి సమగ్ర పోషక పదార్థాల నిర్వహణను ప్రోత్సహించడంలో విశిష్ట ప్రతిభ కనబర్చినందుకు ప్రత్యేక అభినందన పత్రాన్ని డీడీఎస్ కేవీకే అందుకుంది. ఉత్తమ విజయగాథల విభాగంలో రెండో స్థానం, ఉత్తమ బాక్స్ ఐటెమ్స్ కంటెంట్ విభాగంలో రెండో స్థానం , అత్యధిక భూమి ఆరోగ్య కార్డులు జారీ చేసిన విభాగంలో మూడో స్థానం,2024 సంవత్సరంలో డీడీఎస్ కేవీకేలో సుమారు 2,000 మట్టిసాంపిళ్లను విశ్లేషించి, రైతులకు ఉచితంగా మట్టి ఆరోగ్య కార్డులు అందజేసింది.
రైతులకు మరింత సేవలందిస్తాం : ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాద్
డీడీఎస్ కేవీకే కేంద్రం శాస్త్రవేత్తల సహాయ సహకారాలతో సాధించిన విజయాలతో డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జాతీయ వేదికపై మరోసారి తన ప్రతిభను చాటుకుంది. జాతీయస్థాయిలో అవార్డులు సాధించడం తో బాధ్యత మరింత పెరిగింది. రైతులు శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను తెలుసుకొని, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, దిగుబడులు సాధించేందుకు అవలంబించే పద్ధతులను తమ కేంద్రం రైతులకుఅందుబాటులో ఉంటుందని కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాద్ పేర్కొన్నారు.